చంపుతామంటూ వైసీపీ ఎంపీకి బెదిరింపు కాల్స్

చంపుతామంటూ వైసీపీ ఎంపీకి బెదిరింపు కాల్స్

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ రావడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారని అన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు తనను చంపుతామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. తనకు తరచుగా 9618729089, 9538362525, 8247662578, 8886059309 బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని వీటిపై దర్యాప్తు జరపాలని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.