కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం

కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం

వైసీపీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారని, ప్రస్తుతం వాలంటరీల నియామకం జరుగుతుందని అన్నారు.

'ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీని నియమిస్తాం. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్, అర్బన్ ప్రాంతాల్లో డిగ్రీ ఉత్తీర్ణిత కలిగి ఉండాలి.. 5 వేల రూపాయలు తక్కువగా భావించొద్దు, ప్రసాదంలా భావించండి. ట్రైబల్ ప్రాంతాల్లో 10 వ తరగతి అర్హత. ఎవరు పార్టీకి చెడ్డపేరు తీసుకు రావొద్దు. అందరూ ప్రజలకి అందుబాటులో ఉండి, 2024 ఎన్నికల లక్ష్యంగా పని చేయాలి' అని విజయసాయిరెడ్డి తెలిపారు.