ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు

ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అకాల మరణంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్‌ వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీవ్ర విచారకరం. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియచేస్తున్నా.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వైసీపీ నేతలు ఆయన అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.