నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది

నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది

ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించిన విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. 

‘ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ. 500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ. 20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టార’ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.