ఆంధ్రా ఆక్టోపస్ కాదు.. ఇది ఎల్లో జలగ..

ఆంధ్రా ఆక్టోపస్ కాదు.. ఇది ఎల్లో జలగ..

సర్వే పేరుతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయంటూ లగడపాటి రాజ్‌గోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ‘చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ! ’ అని ట్వీట్‌ చేశారు.