రాజీనామా చేస్తున్నందుకు గర్వంగా ఉంది...

రాజీనామా చేస్తున్నందుకు గర్వంగా ఉంది...
నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనుండడంతో ముందుగా ప్రకటించినట్టుగానే రాజీనామాలకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు... రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.... చాలా చిన్నవయసులో ఎంపీని అయ్యా... ప్రజల కోసం, ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయడానికి రాజీనామా చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర ప్రజలు ఎంత గట్టివారో ఢిల్లీకి తెలియడానికే రాజీనామా చేస్తున్నామన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఆంధ్ర ప్రజల ఆకాంక్ష... బీజేపీ తెలుస్తుందన్నారు మిథున్ రెడ్డి. రాజీనామా చేసే ధైర్యం లేకనే టీడీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మిథున్ రెడ్డి... స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేస్తున్నామని... 2019 ఎన్నికల ముందు వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మొత్తం రాజకీయ వాతావరణం మారిపోతుందన్నారు. 6 నెలల కంటే ఎక్కువ సమయం పార్లమెంట్ స్థానాలను ఖాళీగా ఉంచడానికి వీలులేదు... మేం 15 నెలల ముందే రాజీనామా చేస్తున్నాం కాబట్టి... ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి వస్తామని మా అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించారు... కానీ, చంద్రబాబు కలిసిరారు... ఇప్పుడు మేం చేసేదే చేస్తూ ఉంటారని విమర్శించారు... చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదంటున్న మిథున్ రెడ్డి ఇంకా మేం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...