ప్రజాశాంతి పార్టీ గుర్తును పక్కనపెట్టిన ఈసీ

ప్రజాశాంతి పార్టీ గుర్తును పక్కనపెట్టిన ఈసీ

వైసీపీ ఫిర్యాదుతో ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. హెలికాప్టర్ గుర్తు అచ్చం వైసీపీకి చెందిన ఫ్యాన్ గుర్తును పోలినట్లుగా ఉన్నందున ఆ గుర్తును తొలగించి ప్రజాశాంతి పార్టీకి మరో గుర్తు ఇవ్వాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ విజ్ఞప్తి పై ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ మాత్రం తమకు హెలికాప్టర్ గుర్తునే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యాన్ గుర్తు, హెలికాఫ్టర్ గుర్తూ ఒకేలా ఉంటాయా అని వైసీపీ అభ్యర్ధనను తప్పబడుతున్నారు. ఆ రెండు గుర్తుల మధ్య తేడాను ప్రతి ఒక్కరూ గుర్తించగలరని ఆయన అన్నారు.