ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్‌

ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్‌

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్‌ ఇంజెలిజెన్స్‌ ఎస్పీ భాస్కర్‌ భూషన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమర్పించారు.