ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్

కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్‌ జగన్‌ బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. స్థానిక వీజే ఫంక్షన్ హాలులో వైసీపీ నేత రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో ముస్లీం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్‌ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, ఖర్జూరాలు తినిపించారు. ఇఫ్తార్ విందులో పార్టీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.