బాబుది రెండు నాల్కల ధోరణి

బాబుది రెండు నాల్కల ధోరణి

ఏపీ సీఎం చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సొంత జిల్లాకు ఏమి చేయలేని చంద్రబాబు రాష్టానికి ఏమి చేస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమాల చేసిన నేత జగన్ అన్నారు. వచ్చే నెల 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురం బూత్ కమిటీ కన్వీనర్లతో జగన్ సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 13 జిల్లాలలో జరిగే సమావేశాలకు సమరా శంఖారావం అని పేరు పెట్టామని తెలిపారు. ఏదో విధంగా అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 83 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ హాయంలో పూర్తయ్యాయనీ...మిగిలిన పనులు కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో పూర్తయ్యాయని తెలిపారు. పైపై పనులు పూర్తి చేసి నీరు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ విధానాలను కాపీ కొడుతూ ఎన్నికల సమయంలో మోసం చేయటం చంద్రబాబుకు ఆలవాటని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కుల రిజర్వేషన్ గా మార్చి కాపులను తప్పు దారి పట్టిస్తున్నాడని వెల్లడించారు.  రాష్టంలో ఇరవైకి పైగా ఎంపీ సీట్లు వైసీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.