నేడు వైసీపీ తొలి జాబితా

నేడు వైసీపీ తొలి జాబితా

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. అభ్యర్థులను సూత్రప్రాయంగా నిర్ణయించిన వైసీపీ.. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. జాబితా మొత్తం సిద్ధమైందని.. విడతలవారీగా ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రెబల్స్‌, అసంతృప్తుల బెడద తమకు లేదని ఆయన వివరించారు.

వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్‌ జగన్‌ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. బుధవారం జరిగే సమావేశంలో ప్రచార షెడ్యూల్‌ను జగన్ ఖరారు చేయనున్నారు. జగన్‌ ఎన్నికల ప్రచారయాత్రను పెనుగొండ, గాజువాక లేదా గురజాల నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.