సామాజిక వర్గ పోలీసింగ్ పైనే ఫిర్యాదు : బొత్స

సామాజిక వర్గ పోలీసింగ్ పైనే ఫిర్యాదు : బొత్స

పోలీసులను  అధినేత జగన్ ఎప్పుడు టార్గెట్ చేయలేదని వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సిఎం చంద్రబాబు సామాజిక వర్గ పోలీసులను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. దాన్నే ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసామని బొత్స వివరించారు. నిబద్దత గల పోలీస్ లకు అన్యాయం జరగదని తేల్చి చెప్పిన వైసీపీ అగ్రనేత, తమ ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.