ఏ మనిషికే మజిలీయో ...కూల్ లిరిక్స్

ఏ మనిషికే  మజిలీయో  ...కూల్ లిరిక్స్

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న మజిలీ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో సాగుతున్నాయి.  ఒకవైపు హీరో హీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తుండగానే.. సినిమాలోని సాంగ్స్ ను యూనిట్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నది.  ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని మరో సింగిల్ ను రిలీజ్ చేసింది.  

ఏ మనిషికే మజిలీయో అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.  మనం ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి ఇస్తాడు అన్నట్టుగా ఎవరికీ ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది.  కావాలి అనుకున్న వాళ్ళు దూరం కావడం.. వద్దు అనుకున్న వ్యక్తులు దగ్గర అవడం జరుగుతుంది. జీవితంలో ఎదిగేందుకు భార్య ఎలాంటి సహాయం చేసిందో చెప్తున్న.. చేసిన తప్పులను తెలుసుకొని అర్ధం చేసుకున్నానని చెప్పే మీనింగ్ తో వచ్చే సాంగ్ ఇది.  లిరిక్స్ కూల్ గా ఉన్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ కు వనమాలి లిరిక్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.  ఏప్రిల్ 5 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.