ప్రమాణ స్వీకారానికి యడ్యూరప్ప ఏర్పాట్లు?

ప్రమాణ స్వీకారానికి యడ్యూరప్ప ఏర్పాట్లు?

కర్నాటకలో రాజకీయం హైడ్రామా మధ్య నడుస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా ఆహ్వానించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని యడ్యూరప్ప కార్యాలయం కూడా ధ్రువీకరించింది. యడ్యూరప్పతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఓ వార్త ప్రచారం అవుతుంది. కర్ణాటక రాజ్ భవన్‌లో గురువారం మధ్యాహ్నం  12 గంటలకు ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలని యడ్యూరప్పకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలుబడలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పెద్ద ఎత్తున ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయి.