రాత్రంతా అసెంబ్లీలోనే ఉంటా.. నిద్ర కూడా ఇక్కడే

రాత్రంతా అసెంబ్లీలోనే ఉంటా.. నిద్ర కూడా ఇక్కడే

నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ కర్ణాటక అసెంబ్లీని స్పీకర్‌ రమేష్‌కుమార్‌ రేపటికి వాయిదా వేశారు. విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగిన క్రమంలో సభలో తీవ్ర వాదోపవాదాలు జరగడంతో రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని స్పీకర్‌ చెప్పడంతో బీజేపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ విశ్వాసపరీక్షను ముగించాలని గవర్నర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ స్పీకర్‌ పాటించకపోవడంపై బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేయడం సరైన చర్య కాదని పేర్కొన్న బీజేపీ సభ్యలు.. సభ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు పార్టీ సభ్యులంతా రాత్రంతా శాసన సభలోనే ఉంటామని.. ఇక్కడే నిద్రిస్తామని యడ్యూరప్ప తెలిపారు.