రేపే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం!

రేపే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం!

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ.. పకడ్బందీ ప్రణాళికతో వెళుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలో నిలిచిపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇవాళ ఉదయం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్పను ఎన్నుకున్న అనంతరం గవర్నర్ వాజుభాయ్ వాలాను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు. తాజాగా..యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా బీజేపీ ఖరారు చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. విధాన సౌధ పూర్వ ద్వారా వద్ద స్వీకార కార్యక్రమం ఉంటుందని వివరించాయి.