మనసుకు హత్తుకున్న ఏదెట్టు మల్లెలే లిరిక్స్

మనసుకు హత్తుకున్న ఏదెట్టు మల్లెలే లిరిక్స్

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరికల్ వీడియో ఈరోజు రిలీజ్ చేశారు.  ఏదెట్టు మల్లెలే అనే పల్లవితో సాగే ఈ సింగ్ వినసొంపుగా ఉంది.  పదాలు చాలా కొత్తగా ఉన్నాయి.  లిరిక్స్ లో చాలా పదప్రయోగాలు చేసినట్టుగా సాంగ్ వింటుంటే అర్ధం అవుతున్నది.  గోపి సుందర్ కంపోజింగ్ సాంగ్ కు ప్లస్ అయింది.  

దర్శకుడు శివ నిర్వాణ ఈ సాంగ్ ను రాశారు.  ప్రేమికులు విడిపోయినప్పుడు కలిగే బాధను ఈ సాంగ్ లో చూపించారు. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి.  ఈ సాంగ్ కూడా వాటికిమల్లే ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.  మరోవైపు హీరో హీరోయిన్లైనా నాగచైతన్య.. సమంతలు సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.  వరసగా రెండు పరాజయాల తరువాత చైతన్య చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.