ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

కన్నడ పీఠంపై యడ్యూరప్ప కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఇవాళ ఉదయం 9.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో యడ్యూరప్ప చేత గవర్నర్‌ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాధాకృష్ణ ఆలయంలో యడ్యూరప్ప పూజలు చేశారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు బీజేపీకి గవర్నర్‌ 15 రోజులు గడువిచ్చిన విషయం తెలిసిందే.. దీంతో.. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. బల నిరూపణ పూర్తయ్యే వరకు క్యాబినెట్‌ను విస్తరించే అవకాశం కూడా లేదు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాలేదు.