టీఆర్ఎస్ లో చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ లో చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 101కి చేరింది.