30 శాతం క్షీణించిన ఎస్‌ బ్యాంక్‌ షేర్‌

30 శాతం క్షీణించిన ఎస్‌ బ్యాంక్‌ షేర్‌

రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌ గ్రేడ్‌ చేయడంతో ఎస్‌ బ్యాంక్‌ షేర్‌ భారీగా క్షీణించింది. ఆంతకుమునుపు ప్రమోటర్, కంపెనీ ఛైర్మన్‌ రానా కపూర్‌ను కొనసాగించే విషయమై గొడవలు రావడంతో ఈ కంపెనీ షేర్‌ భారీగా క్షీణించింది. తరవాత కంపెనీ ఖాతాలపై అనుమానాలు వచ్చాయి. అయితే ఇవన్నీ సద్దు మణిగిన తరవాత ఈ షేర్‌ భారీగా పెరిగి మళ్ళీ రూ. 300కు చేరువైంది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్‌ను కొనుగోలు చేశారు. దీంతో వీరి వాటా 40 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ భారీ నష్ట్టాన్ని ప్రకటించింది. అలాగే మాక్యురీ రేటింగ్‌ ఏజెన్సీ బ్యాంక్‌ రేటింగ్‌ను తగ్గించడంతో పాటు సారీ  చెప్పడంతో ఇవాళ ఎస్‌ బ్యాంక్‌ షేర్‌ ఏకంగా 30 శాతం తగ్గింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ. 167 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 16500 కోట్లు తగ్గింది.