విలన్ గా మారిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

విలన్ గా మారిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

ఒకప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి సిమ్రన్.  దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఈ మధ్యే కెరీర్లో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు.  ప్రస్తుతం ఈమె యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 'సీమ రాజ' చిత్రంలో నటిస్తున్నారు. 

ఇందులో ఈమెది విలన్ పాత్రట.  ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె ఇప్పుడు ఇలా ప్రతినాయకిగా మారిపోవడం ఆసక్తిని కలిగించే అంశం.  మరి ఇన్నాళ్లు అందం, అభినయంతో అలరించిన సిమ్రన్ తనలోని క్రూరత్వంతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.  త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తోంది.