యో-యో టెస్ట్ అవసరమే కానీ...

యో-యో టెస్ట్ అవసరమే కానీ...

ప్రస్తుతం ఏ దేశ క్రికెటర్ అయినా సరే జట్టులోకి ఎంపిక కావాలంటే యో-యో పరీక్ష నెగ్గాల్సిందే. యో-యో టెస్టులో ఫిట్‌నెస్‌ సాధిస్తేనే జట్టులో స్థానం కల్పిస్తున్నారు అన్ని దేశాల సెలెక్టర్లు. ఐపీఎల్‌-11లో అద్భుతంగా రాణించిన భారత ఆటగాళ్లు అంబటి రాయుడు, సంజూ శాంసన్‌లు ఇంగ్లాండ్ సిరీస్ కి ముందు నిర్వహించిన యో-యో టెస్టులో విఫలమై స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు యో-యో టెస్ట్ ను సమర్దిస్తుంటే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా యో-యో పరీక్షపై భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్పందించారు. 'యో-యో పరీక్ష లాంటివి అవసరమున్నప్పటికీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఇతర అంశాలనూ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఫీల్డింగ్‌ ప్రమాణాలు కఠినంగా ఉంటాయని భావిస్తా. అయితే యోయో పరీక్ష ఒక్కటే ఆటగాళ్ల ఎంపికకు ప్రామాణికం కాకుడదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, సామర్థ్యంను కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని సచిన్‌ తెలిపారు.