యోగా బామ్మ నానమ్మల్ కన్నుమూత..

యోగా బామ్మ నానమ్మల్ కన్నుమూత..

యోగా బామ్మగా పేరుపోందిన తమిళనాడుకు చెందిన నానమ్మల్ ఇక లేరు... గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 99 ఏళ్ల నానమ్మల్.. కోయంబత్తూరులోని తన స్వగృహంలో మృతిచెందారు. కాగా, నానమ్మల్‌కు 2018లో కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2016లో నారీ శక్తి పురస్కార్‌, 2017లో యోగా రత్న అవార్డులు అందుకున్నారు. గత 45 ఏళ్లలో ఆమె 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు యోగా నేర్పారు. 36 మందితో సహా 600 మందికి పైగా యోగా బోధకులను తయారు చేవారు. సింగపూర్, మలేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలలో ఆమె బోధించిన బోధకులు యోగా నేర్పించారు. 100 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా యోగాలో ప్రజలకు శిక్షణ ఇస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు... కానీ, 99 ఏళ్లకే అమె కన్నుమూశారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు సిలాంబంతో సహా గ్రామీణ జానపద కళలలో రాణించారు. ఆమె భర్త వెంకటసామి కూడా లేరు. ఆమెకు ఐదుగురు పిల్లలు, 12 మంది మనవరాళ్ళు మరియు 11 మంది మునుమనవళ్లు ఉన్నారు.