ధోనీపై యువరాజ్‌సింగ్‌ తండ్రి ఫైర్‌..

ధోనీపై యువరాజ్‌సింగ్‌ తండ్రి ఫైర్‌..

మహేంద్రసింగ్‌ ధోనీపై ఛాన్స్‌ దొరికితే విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి తన నోటికి పని చెప్పారు. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో టీమిండియా ఓటమికి ముమ్మాటికి ధోనీయే కారణమని అంటున్నారు యోగ్‌రాజ్‌. కీలక ఓవర్లలో నెమ్మదిగా ఆడిన ధోనీ.. రవీంద్ర జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని అభిప్రాయపడ్డారాయన. హర్ధిక్‌ పాండ్యా కూడా ధోనీ చెప్పడంతోనే బౌలర్లపై ఎదురుదాడి చేయబోయి పెవిలియన్‌ చేరాడని అన్నారు యోగ్‌రాజ్‌. 300 వన్డేలకు పైగా ఆడిన ధోనీకి ఎలా ఆడాలో కూడా తెలియకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

'భారీ సిక్సర్లు కొడతానంటావు. మరి కీలక సమయంలో ఎందుకు చేతులెత్తేశావు. అవుటైపోతానని భయపడ్డావా..? నువ్వు ముందే అవుటైపోయినా పెద్ద తేడా ఉండేది కాదేమో..!' అని వ్యాఖ్యానించారు యోగ్‌రాజ్‌. ఎలా ఆడాలో తెలియని ధోనీ మాత్రం ఇతర బ్యాట్స్‌మన్‌కు సలహాలివ్వడం హాస్యాస్పదమని యోగ్‌రాజ్‌ అన్నారు. ఇలా ఆడు.. అలా ఆడు అని తన కొడుకు యువరాజ్‌సింగ్‌ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు. అంబటి రాయుడు కెరీర్‌ కూడా ధోనీ కారణంగానే నాశనమైపోయిందని రెండు రోజుల క్రితం యోగ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు.