మీరు ధరించిన చొక్కాను తినొచ్చు

మీరు ధరించిన చొక్కాను తినొచ్చు

మీరు వింటున్నది నిజమే. మీరు వేసుకున్న షర్ట్ ను ఇక అక్కర్లేదు అనుకున్న తరువాత ఆహారంగా తినేయొచ్చు. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఎ అండ్ ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఆహారంగా వాడగలిగిన కాటన్  ను ఉత్పత్తి చేయబోతున్నారు. ఈ ప్రక్రియలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్తకు కీలకమైన భాగం దక్కడం మరో విశేషం. 23 ఏళ్ల క్రితమే కీర్తిరాథోడ్ అనే శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేశారు. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. మరి కొద్ది నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. 

కాటన్ సీడ్ లో విషపదార్థాన్ని ఉత్పత్తి చేసే జన్యువు అయిన గాసిపోల్ ను నిర్వీర్యం చేయడం ద్వారా కాటన్ సీడ్ ను ఆహారంగా ఉపయోగించే అవకాశం చిక్కుతుంది. అయితే గాసిపోల్ జన్యువు.. పత్తి మొక్కను క్రిమి, కీటకాల బారి నుంచి కాపాడుతుంది. బాదం, పిస్తా వంటి గింజల్లాగే కాటన్ సీడ్ లో కూడా అత్యున్నతమైన పోషక విలువలున్నాయి. రుచి కూడా వాటిలాగే ఇష్టంగా తినేటట్టుగానే ఉంటుందంటున్నారు. 

ఎడిబుల్ కాటన్ తో రోజుకు ప్రపంచ మానవాళికి అవసరమైన అన్ని పోషకాలూ దొరుకుతాయని, 600 మిలియన్ల ప్రజల ఆహార అవసరాలు తీరుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాటన్ సీడ్ నుంచి ఇప్పటికే పాలను తయారు చేసిన శాస్త్రవేత్తలు... క్రాకర్స్, కుకీస్, నట్ బటర్స్, ఎనర్జీ బార్స్ వంటి చిరుతిళ్ల రూపంలో కూడా ప్రయోగపూర్వకంగా తయారుచేసి సక్సెస్ అయ్యారు. ఈ ప్రయోగంతో కాటన్ సీడ్ ను ఆహారంగా, పీచు పదార్థంగా ఉపయోగించే రోజులు దగ్గర్లనే ఉన్నాయన్నమాట.