'పబ్ జీ'కి యువకుడు బలి

'పబ్ జీ'కి యువకుడు బలి

పబ్ జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ కు బానిసలైపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పబ్ జీ ఆడి పలువురు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ గేమ్ ను భారత్ లో నిషేదించాలని డిమాండ్లు సైతం వెలువడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది పబ్ జీ ఆడి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా... మరో యువకుడు పబ్ జీ గేమ్ కు అలవాటు పడి మృత్యువాత పడ్డాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన సాగర్ అనే 20 ఏళ్ల యువకుడు పబ్ జీ గేమ్ ఆడతూ మెడనరాలు పట్టేసుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత 46 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.