చిరంజీవిని కలిసిన యంగ్ హీరో.. ఎందుకంటే..

చిరంజీవిని కలిసిన యంగ్ హీరో.. ఎందుకంటే..

నటుడు సుధాకర్ కోమాకుల తన  సతీమణి హారిక సందెపోగు తో  కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్బం గా చిరంజీవి గారు, ‘ఇందువదన’  పాటని వైరల్ చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో వీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ, అలాగే తన సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుందని చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలతో ఈ రోజూ అలా మిగిలిపోతుందని చెబుతూ సంతోషంలో ఉబ్బితబ్బిపోతున్నారు. ఇలా, బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉన్న కొత్త తరాన్ని నిస్స్వార్ధంగా ఉత్సాహపరిచే తన వ్యక్తిత్వాన్ని మెగాస్టార్ మరోసారి చూపించారు.