ప్రేమ పేరుతో యువతికి వేధింపులు..పోలీసుల సపోర్ట్.!

   ప్రేమ పేరుతో యువతికి వేధింపులు..పోలీసుల సపోర్ట్.!

ప్రేమపేరుతో జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రేమ పేరుతో ఓ బీటెక్ విద్యార్థినిని తోటి విద్యార్థులు వేధించిన సంగతి మరవక ముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో శివానంద్ అనే యువకుడు  అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసాడు. నీతోనే జీవితమని..నువ్వులేకుంటే బ్రతకలేనని నమ్మబలికాడు. దాంతో యువకుడి మాటలకు పడిపోయిన యువతి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరగటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెతో యువకుడు ఫోటోలు దిగాడు. అనంతరం తనకు డబ్బులు కావాలంటూ వేధించటం మొదలు పెట్టాడు. దాంతో భయపడిన యువతి పలుమార్లు డబ్బులు సమర్పించుకుంది. ఇక తరవాత బంగారు గాజులు ఇవ్వాలని లేదంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దాంతో యువతి గాజులు సైతం ఇచ్చేసింది. ఇక ఇస్తూ పోతే యువకుడు బెదిరిస్తూనే ఉంటాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బంగారు గాజుల విషయంలో శివానంద్‌కు ఈపూరు, రొంపిచర్ల పోలీస్‌‌స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు స‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించటం లేదు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.