ప్రియురాలు లేదని తెలిసి.. తానూ కూడా..

ప్రియురాలు లేదని తెలిసి.. తానూ కూడా..

ప్రేమించిన యువతి దూరం అయిందన్న కారణంతో ఓ యువకుడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఘట్ కేసర్ లో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ పీఎస్ పరిధిలోని రామకృష్ణాపురంకు చెందిన కారు డ్రైవర్ పల్లపు శివ.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే రెండు రోజుల క్రితం ఆ యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మరణ వార్త తట్టుకోలేని ప్రియుడు శివ తన కారులో ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. స్నేహితులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. ‌వారు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహంను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.