తెలంగాణలో మరో దారుణం... పదేళ్ల బాలికపై అత్యాచారం... చితక్కొట్టిన గ్రామస్తులు 

తెలంగాణలో మరో దారుణం... పదేళ్ల బాలికపై అత్యాచారం... చితక్కొట్టిన గ్రామస్తులు 

గత కొంతకాలంగా దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.  క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో ప్రజలు భయటకు వచ్చేందుకు జంకుతున్నారు.  తెలంగాణలో దిశ ఘటన తరువాత మహిళలపై అత్యాచారాలు తగ్గిపోతాయని అనుకున్నారు.  కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది.  మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  చిన్న పిల్లలను కూడా వదలడం లేదు కామాంధులు.  

ఇక ఇదిలా ఉంటె, రీసెంట్ గా వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ఓ దారుణం చోటు చేసుకుంది.  సాయి అనే యువకుడు పదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  ఇంటికి వచ్చిన ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అత్యాచారానికి పాల్పడిన సాయిని పట్టుకొని చితక్కొట్టారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు.  ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.  చిన్నపిల్లలను రేప్ చేసిన కామాంధుడిని వెంటనే ఉరి తీయాలని, లేదంటే కాల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.