ప్రభాస్ డబ్బింగ్ చెప్తున్నాడా..?

ప్రభాస్ డబ్బింగ్ చెప్తున్నాడా..?

సాహో సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది.  ఒకవైపు సినిమా పూర్తిచేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను షురూ చేస్తున్నారు.  తెలుగులో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటాడు సరే.  ఇప్పుడు హిందీ వెర్షన్ లో కూడా ప్రభాస్ డబ్బింగ్ చెప్తాడని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు.  

హిందీ డబ్బింగ్ చెప్పేందుకు, హిందీ మాడ్యులేషన్ కోసం ట్యూటర్ ను పెట్టుకొని నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.  రిలీజ్ కు రెండు నెలల సమయం ఉంది.  ఈలోపు మాడ్యులేషన్ సరిగ్గా వస్తే సరే లేదంటే వేరేవాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారేమో.  ప్రభాస్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  డబ్బింగ్ చెప్పుకొని తీరుతానని అంటున్నాడు.  బాహుబలి సినిమాతో ప్రభాస్ కు నార్త్ లోను ఫ్యాన్స్ పెరిగిపోయారు.  వాళ్ళను అలరించేందుకు సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడు.  ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.