'ఇండియన్-2' లో యువ స్టార్ హీరో !

'ఇండియన్-2' లో యువ స్టార్ హీరో !

స్టార్ నటుడు కమల్ హాసన్ చేయబోతున్న సినిమా 'ఇండియన్ 2'.  'భారతీయుడు'కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు.  ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్న ఈ ప్రాజెక్ట్ ఇంకొంత ఆసక్తికరంగా మారింది. 

అందుకు కారణం ఈ సినిమాలో స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ నటించే అవకాశాలున్నాయట.  ఒకవేళ దుల్కర్ కమల్ తో కలిసి నటిస్తే సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇకపోతే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ఇందులో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట.