ఉద్యోగం కోసం వెళ్తే నిర్బంధం..! 2 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌

ఉద్యోగం కోసం వెళ్తే నిర్బంధం..! 2 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌

అమ్మాయిలపై రోజురోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇంట్లో రక్షణ లేదు బయటకి వెళ్లినా గ్యారంటీలేదు... ఉద్యోగానికి వెళ్లే తిరిగి వస్తారా? అనే నమ్మకం లేకుండా తయారైపోతోంది పరిస్థితి... ఉద్యోగం కోసమంటూ ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి దాదాపు రెండు నెలలు కనిపించకుండా పోయింది.. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆ యువతిపాలిట శాపంగా మారింది.. యువతిని హోటల్ రూమ్‌లో బందించి దాదాపు రెండు నెలల పాటు చిత్రహింసలు పెడుతూ.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వెలుగు చూసింది.. 

వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగం పేరుతో యువతిని ప్రలోభపెట్టిన కొందరు కామాంధులు ఓ హోటల్‌ గదిలో నిర్బంధించి రెండు నెలల పాటు శారీరకంగా హింసకు గురిచేస్తూ.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. సదరు యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె మేనత్త మార్చి నెలలో తన ఇంటికి తీసుకొచ్చింది.. మార్చి 20వ తేదీన నందన్ అనే వ్యక్తి దగ్గరకు ఆ యువతిని పంపించింది.. ఇక, ఉద్యోగం గ్యారంటీ.. ట్రైనింగ్ ఉంటుందని నమ్మబలికిన నందన్... ఆమెను ఓ హోటల్‌ గదిలో పెట్టాడు.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో యువతి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి వచ్చింది.. దాన్నే అవకాశంగా మల్చుకున్న నందన్... తన స్నేహితులతో కలిసి సదరు యువతి గదికి వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఒకటికాదు.. రెండు.. కాదు.. ఇలా వారి పైశాచికాన్ని హద్దులు లేకుండా పోయింది.. దాదాపు రెండు నెలల పాటు ఆ యువతిపై పడి తమ పశువాంఛను తీర్చుకున్నారు.. తాము చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరించడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో వారి హింసను మౌనంగా భరిస్తూ వచ్చింది బాధితురాలు.. ఇక, ఎలాంటి కమ్యూనికేషన్ కూడా తనకు అందుబాటులో లేకుండా చేయడంతో ఈ ఘోరాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి.. అయితే, 4 రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన బాధిత యువతి.. తాను కటక్ ఆస్పత్రిలో ఉన్నానని సమాచారం ఇచ్చింది.. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కూతురు పరిస్థితి చూసి, జరిగన ఘోరాన్ని తెలుసుకుని రిని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. దీనికి మూలకారణం.. తన మేనత్తేనని ఆరోపిస్తోంది యువతి... 4 రోజుల క్రితం మేనత్త హోటల్‌ గదికి వచ్చి తనను కిటికీలో నుంచి బయటకు తోసేసిందని, తీవ్ర గాయాలపాలైన నన్ను.. స్థానికులు ఆస్పత్రిలో చేర్చారని చెప్పుకొచ్చింది. ఇక, ఈ దారుణాన్ని సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్.. సోషల్ మీడియా ద్వారా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, యువతి తల్లిదండ్రు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కటక్ బంకి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.