సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన.. బాలికపై గ్యాంగ్ రేప్ 

సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన.. బాలికపై గ్యాంగ్ రేప్ 

తెలంగాణలో దిశ ఘటన తరువాత ఇలాంటి సంఘటనలు తగ్గిపోతాయి అనుకుంటే, తగ్గకపోగా నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.  దీంతో తెలంగాణలో భద్రతను మరింతగా పెంచారు.  నిత్యం పోలీసులు పహారా కాస్తున్నా ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  

తాజాగా, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో మరో దిశ ఘటన జరిగింది.   షాప్ కు వచ్చిన ఓ బాలికను ముగ్గురు దుండగులు కారులో అపహరించుకొని వెళ్లి, గ్యాంగ్ రేప్ చేశారు.  అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లారు.  అయితే, బాలిక తల్లిదండ్రులు 100 కి డయల్ చేయడంతో పోలీసులు హుటాహుటిన సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి అమ్మాయి ఆచూకీ కనుగొన్నారు.  సంఘటన స్థలంలో పోలీసులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.