నెల్లూరులో దారుణం...యువతి బట్టలిప్పేసి 

నెల్లూరులో దారుణం...యువతి బట్టలిప్పేసి 

ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నెల్లూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. యువతిని వివస్త్రను చేసి.. బట్టలు లాక్కొని వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కపడ్డారు.  ఈ ఘటన బుధవారం రాత్రి నెల్లూరులో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..  స్థానిక వెంకటేశ్వరపురం జనార్ధన్‌రెడ్డి కాలనీలో ఓ మసీదు ఉంది. దాని వెనక ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా తయారైంది. నిత్యం అక్కడ మందు పార్టీలు, అనంతరం ఆకతాయిల లొల్లి అక్కడ సాధారణంగా మారాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి అక్కడి నుంచి ఓ గొర్రెల కాపారి వెళ్తుండగా ఆ ఖాళీ స్థలంలో యువతి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో ఏదో జరుగుతుందోనని భావించి కాస్త దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ కొందరు ఆకతాయిలు యువతిని వివస్త్రను చేసి, భయపెడుతూ వేధించడం చూసి షాక్ అయ్యాడు. ఆ గొర్రెల కాపరి తన వద్ద ఉన్న టార్చిలైట్‌ను వేయడంతో ఆ యువకులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. బాధిత యువతి తన దుస్తులు తీసుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.