సందీప్ రెడ్డికి భారీ మద్దతు..

సందీప్ రెడ్డికి భారీ మద్దతు..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఎంత పెద్ద దర్శకుడైనా ఒక్కోసారి కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం సహజమే.  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిలు అమ్మాయిల మధ్య ప్రేమ వ్యవహారం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  

దీనిపై వివాదం చెలరేగింది.  సందీప్ రెడ్డి వ్యాఖ్యలకు అటు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికారు.  అదే విధంగా యువత సోషల్ మీడియాలో మద్దతు పలుకుతున్నారు.  వీ సపోర్ట్ సందీప్ రెడ్డి పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మద్దతు ఇస్తున్నారు.