జగన్‌పై దాడి కేసు: మరింత గడువు కోరిన సర్కార్..

జగన్‌పై దాడి కేసు: మరింత గడువు కోరిన సర్కార్..

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో ఎన్‌ఐఏ విచారణపై గతంలోనే రిట్ ఫైల్ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే కేంద్రానికి హైకోర్టు సూచించింది.. కోర్టు సూచనల మేరకు ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. అయితే, ప్రభుత్వమే మరింత గడువు కోరడంతో విచారణను పిబ్రవరి 12కి వాయిదా వేసింది హైకోర్టు.