2024లోనూ అధికారంలోకి వస్తాం..!

2024లోనూ అధికారంలోకి వస్తాం..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమైన సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ సంస్థకు స్వయంగా వెళ్లి పీకే టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ చీఫ్... రెండేళ్ల నుంచి నిర్విరామంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. ప్రశాంత్ కిషోర్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన ప్రభుత్వం వస్తోంది.. నా పాదయాత్ర క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లారు.. ప్రజల్లోకి వెల్లడంతో వైసీపీ అధికారంలోకి రానుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇలానే కష్టపడి పని చేస్తే 2024 ఎన్నికల్లో కూడా మనం‌ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.