తేల్చేసిన జగన్..మండలి రద్దు ఖాయం

తేల్చేసిన జగన్..మండలి రద్దు ఖాయం

మండలి రద్దవుతుందా? ప్రభుత్వం రద్దుదిశగా తీర్మానం చేస్తుందా ఇంకా వేరే ప్రత్యామ్నాయాలున్నాయా? సోమవారం అసెంబ్లీలో ఏం జరగబోతోంది.?అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు ఏపీ సీఎం జగన్. మండలిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మండలి రద్దుకు రేపే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 09.30కి ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది, ఈ భేటీలో మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలపనున్న కేబినేట్ తదుపరి చర్యలకి ఉపక్రమించనుంది. టీడీపీ ఎమ్మెల్సీలు వచ్చె అవకాశం ఉందని నేతలు చెబుతున్నా బేరసారాలకు అవసరం లేదన్న జగన్  తనను చంద్రబాబులా తయారు చేయద్దని నిర్మొహమాటంగా చెప్పినట్టు సమాచారం. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లులకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. మండలి నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు కేబినెట్‌లో ఉన్నారు. దీంతో మండలి రద్దు విపక్షంతో పాటు అధికార పార్టీకి ఇబ్బందిగానే మారనుందని కొందరు చెబుతున్నారు.