రేపు ఢిల్లీకి జగన్... ఎందుకో తెలుసా?

రేపు ఢిల్లీకి జగన్... ఎందుకో తెలుసా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారిస్తూనే మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై దృష్టి పెట్టింది.  విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రానికి ఇప్పటికే అనేకమార్లు విజ్ఞప్తి చేసింది.  కానీ, కేంద్రం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా అన్నది జరిగిపోయిన విషయం అని, ఇకపై ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.  

అయితే, జగన్ మాత్రం పట్టువదలడం లేదు.  ఎలాగైనా సరే ప్రత్యేక హోదాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  మరోసారి ఈ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు.  రేపు ఢిల్లీలో ప్రధాని మోడీ, హోమ్ శాఖామంత్రి అమిత్ షాను కలిసి ఈ విషయంపై చర్చించబోతున్నారు.  ప్రత్యేక హోదా విషయంతో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం, మూడు రాజధానుల అంశం గురించి కూడా జగన్ కేంద్రంతో మాట్లాడబోతున్నారు.  ఇప్పటికే కేంద్రం రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది.  ఇది తమ పరిధిలోకి రాదనీ,అది రాష్ట్రాల విషయం అని పేర్కొన్న సంగతి తెలిసిందే.