శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్..

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన వైసీసీ ఎమ్మెల్యేలు... వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎన్నుకుంటూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. వైసీపీఎల్పీ నేతగా వైఎస్ జగన్‌ పేరును ఆ పార్టీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. బుగ్గన, ధర్మాన, పార్థసారథి, ఆదిమూలపు సురేష్. ఏకవాక్య తీర్మానంతో ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఆ తీర్మానం కాపీతో తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. తీర్మానం కాపీని గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు.