ఇవాళ జగన్ ప్రచారం ఇలా..

ఇవాళ జగన్ ప్రచారం ఇలా..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు సర్కార్ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ, కొయ్యూరో బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైఎస్ విజయమ్మ ప్రచారం చేస్తారు. సింగనమల, పత్తికొండ నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజమండ్రి రూరల్, విశాఖలో ప్రచారం చేయనున్నారు షర్మిల.