జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆస్తుల కేసులో శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న జగన్... ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌.. సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 317కింద వైఎస్ జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదేకేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది కూడా కోర్టుకు నివేదించారు. ఈ రెండు పిటిషన్లను అనుమతించిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 21కి తేదీకి వాయిదా వేసింది.