చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారు!

చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారు!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చంద్రబాబు మళ్లీ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దీక్షపై స్పందించిన వైఎస్ జగన్... చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మా పార్లమెంట్ సభ్యులంతా రాజీనామా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసిఉంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదన్నారు జగన్. అందరు ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగి... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదని తెలిపారు వైఎస్ జగన్. మరోవైపు జగన్ ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర ముగించి హైదరాబాద్‌ బయల్దేరారు... ఉదయం కృష్ణా జిల్లాలో 14వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించిన జగన్... శోభనాపురం శివారు నుంచి కొత్తఈదర వరకు 3 కిలోమీటర్లు మేర పాదయాత్రకు కొనసాగించారు. రేపు కోర్టు వాయిదా ఉండటంతో... పాదయాత్రను ముగించి హైదరాబాద్‌కు పయనమయ్యారు జగన్... ఎల్లుండి ఉదయం ఆగిరిపల్లి మండలం సీతారాంపురం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.