కరోనాకు చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ సంచలన నిర్ణయం... రెండో రోజుల్లో అమలుకు సిద్దం..,

కరోనాకు చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ సంచలన నిర్ణయం... రెండో రోజుల్లో అమలుకు సిద్దం..,

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన బారిన పడిన వ్యక్తుల సంఖ్య 19 కి చేరింది.  దీంతో జగన్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది.  మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ కు విదేశాల నుంచి 29 వేలమంది వచ్చారు.  వీరిపై పోలీసులు ప్రత్యేకమైన నిఘా ఉంచారు.  వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.  దీనికోసం జగన్ సర్కార్ సాంకేతికరంగాన్ని వినియోగించుకుంది.  విదేశాల నుంచి వచ్చిన వాళ్ళపై నిఘా పెట్టేందుకు పోలీసులు ప్రత్యేకంగా జియో ఫెన్సింగ్ తో పనిచేసే యాప్ ను రూపొందించారు.  ఈ యాప్ ను విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి.  వారి వివరాలను అందులో పొందుపరచాలి.  హోమ్ క్వారెంటైన్ లో ఉండే వ్యక్తులు ఉన్న చోటు నుంచి 5 మీటర్లు కదిలితే వెంటనే పోలీసులను అలర్ట్ చేస్తుంది.  క్షణాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని బయటకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు.  ఈ విధానం ద్వారా కొంతవరకు  కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఏపీ పోలీసులు చెప్తున్నారు.  ఈ యాప్ రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది.  ఈ యాప్ అందుబాటులోకి వస్తే..విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల కదలికలను ఈజీగా పసికట్టవచ్చు.