మనసున్న మారాజు.. వైఎస్ జగన్

మనసున్న మారాజు.. వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన శారదా పీఠం వెళ్లి స్వామిజీని దర్శించుకున్నారు. తిరిగి గన్నవరం వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళుతుండగా.. రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకుడు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు. కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ కుమార్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీలోగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రితో వారు చెప్పారు. వారి మాటలను ఆలకించిన సీఎం జగన్‌.. ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్‌ మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.