సంబరాల్లో వైఎస్ జగన్..

సంబరాల్లో వైఎస్ జగన్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబరాల్లో మునిగిపోయారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉండి ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న వైఎస్ జగన్... తమ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఆనందోత్సవాల్లో తేలియాడుతున్నారు. ఫలితాలను టీవీలో వీక్షిస్తూ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని హుషారుగా ఆలింగనం చేసుకున్నారు వైఎస్ జగన్. మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యాలయం దగ్గర టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుతూ... స్టెప్పులు వేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు వైసీపీ హవా కొనసాగుతుండటంతో జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు తెలిపారు.