గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్ 

గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్ 

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసింది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా  తీసుకెళ్లింది.