గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ

గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఉదయం తాడేపల్లిలో ఎల్పీనేతగా జగన్ ను ఎన్నుకున్న కాపీని గవర్నర్ కు అందచేశారు. ఈ భేటీలో జగన్ తో పాటు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఉన్నారు. అనంతరం ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు. ఈరోజు హైదరాబాద్ లోనే బసచేయనున్న జగన్ రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు.