నేడు ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ

 నేడు ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ

వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఢిల్లీకి వెళ్తారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్‌ తదితరులు కూడా జగన్‌ వెంట ఉంటారని సమాచారం.